చోడవరం;ఉషోదయ కాలేజీలో ఘనంగా సంక్రాంతి సంబరాలు

2చూసినవారు
చోడవరం;ఉషోదయ కాలేజీలో ఘనంగా సంక్రాంతి సంబరాలు
చోడవరంలోని ఉషోదయ కళాశాల ప్రాంగణంలో శనివారం సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా విద్యార్థినులు ముగ్గులు, గొబ్బెమ్మలతో కళాశాల ప్రాంగణాన్ని అలంకరించారు. విద్యార్థులు, అధ్యాపకులు సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొని సంక్రాంతి పాటలు, నృత్యాలు ప్రదర్శించి పండుగ వైభవాన్ని చాటారు. మామిడి తోరణాలు, రంగురంగుల ముగ్గులతో కళాశాల ప్రాంగణం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్