అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం వడ్డాది గ్రామంలోని NTS స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. వడ్డాది స్టేట్ బ్యాంక్ మేనేజర్ ఈ వేడుకలను ప్రారంభించి, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. స్కూల్ కరెస్పాండెంట్ V.V రామరాజు మాట్లాడుతూ, మన సంస్కృతి, సంప్రదాయాలను విద్యార్థులకు తెలియజేయడానికి ఈ వేడుకలను ప్రతి ఏటా నిర్వహిస్తామని తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో విద్యార్థులు ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు.