ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం

380చూసినవారు
ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం
మాడుగుల నియోజకవర్గం కే కోటపాడు మండలం చంద్ర పేటలో ఆదివారం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ పార్టీ అధ్యక్షుడు సబ్బవరపు వాసుదేవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సబ్బవరపు రామునాయుడు, మాజీ ఎంపీపీ సబ్బవరపు పుష్పావతి, సబ్బవరపు అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఎగురవేసి, కేకులు కట్ చేసి అందరికీ పంచారు.

సంబంధిత పోస్ట్