లక్ష్మీపురం గ్రామంలో సంతాన గణపతి ఆలయ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది

5చూసినవారు
చోడవరం మండలం లక్ష్మీపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన సిద్ధి బుద్ధి సమేత శ్రీ సంతాన గణపతి ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. వేద పండితులు మంత్రోచ్ఛారణాల మధ్య గ్రామ పెద్దలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్ధి బుద్ధి సమేత శ్రీ సంతాన గణపతి స్వామివారిని ప్రతిష్టించారు. శిఖర ఆవిష్కరణ కార్యక్రమం కూడా చేపట్టారు. స్థానికులతో పాటు వివిధ గ్రామాల భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. మధ్యాహ్నం ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్