రోలుగుంట మండలం అర్ల, శరభవరం పంచాయతీ పరిధిలోని రాజన్నపేట నుండి అర్ల వెళ్లే రోడ్డు బోడు మెట్ట వద్ద బురద ఊబి తొలగించాలని గిరిజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిరసన తెలిపారు. నల్లరాయి క్వారీ రోడ్డు నిర్మాణం కోసం కొత్త రోడ్డు నిర్మించగా, తారు రోడ్డు వద్ద బురద ఊబి ఏర్పడింది. దీనివల్ల రాత్రి వేళల్లో గిరిజనులు బైక్‌లతో ఊబిలో పడిపోతున్నారు, 108 కూడా రావడానికి ఆస్కారం లేదని, రేషన్ బియ్యం కోసం రాజన్నపేటకు కాలినడకనే వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని వారు వాపోతున్నారు.