మాడుగులలో జరుగుతున్న శ్రీ వేణుగోపాల స్వామివారి కళ్యాణ ఉత్సవాల్లో భాగంగా గురువారం మధ్యాహ్నం దాతల సహకారంతో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముందుగానే వికాస తరంగణి మహిళలు వచ్చిన భక్తులకు కుంకుమ గంధం పెట్టి అన్నదానానికి ఆహ్వానించి నూతన విధానానికి శ్రీకారం చుట్టారు. ఇది సంప్రదాయబద్ధమని మన సంస్కృతిని గుర్తు చేయమని మహిళలు చెప్పుకొచ్చారు. దీంతో పలువురు వారిని అభినందించారు.