ఆల్ ఇండియా ట్రేడియన్ కాంగ్రెస్ (ఏఐటియుసి) 106వ ఆవిర్భావ దినోత్సవాన్ని విశాఖపట్నంలోని సీతమ్మధార అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జెండాను రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ, దేశంలో జాతీయస్థాయిలో మొట్టమొదటి అఖిలభారత కార్మిక సంఘంగా ఏఐటియుసి 1920 అక్టోబర్ 31న ఆవిర్భవించిందని, ఇప్పటికి 105 సంవత్సరాలు పూర్తి చేసుకుని 106వ ఏట ప్రవేశిస్తోందని తెలిపారు.