జీవీఎంసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'వేస్ట్ టు వండర్' పోటీలు నగరవాసులను ఆకట్టుకుంటున్నాయి. భీమిలి ప్రాంతానికి చెందిన కళాకారులు పాత ఇనుప సామాగ్రితో అద్భుత కళాఖండాలను సృష్టించారు. 3వ వార్డుకు చెందిన వాసుపల్లి భార్గవ్, గోవర్ధన్ బృందం 300 కిలోల ఆటోమొబైల్ విడిభాగాలతో 'సీ హార్స్'ను, 4వ వార్డుకు చెందిన మిండ సింహాచలం బృందం 488 కిలోల వ్యర్థాలతో 'ఏనుగు' విగ్రహాన్ని రూపొందించి తమ నైపుణ్యాన్ని చాటుకున్నారు.