విశాఖలో అంబటి రాంబాబు పర్యటన

2చూసినవారు
విశాఖలో అంబటి రాంబాబు పర్యటన
బెయిల్ పై విడుదలైన మాజీ మంత్రి, వైసీపీ నాయకులు అంబటి రాంబాబు బుధవారం విశాఖపట్నంలో పర్యటించారు. ఈ సందర్భంగా ద్రోణంరాజు సత్యనారాయణ, శ్రీనివాస్ నివాసాన్ని సందర్శించిన ఆయనకు వైసీపీ సీనియర్ నాయకులు ద్రోణంరాజు శ్రీవత్సవ ఘన స్వాగతం పలికారు. అంబటి రాంబాబును కలిసి అభినందనలు తెలిపిన వారిలో జిల్లా ముస్లిం నేతలతో పాటు వైసీపీ సీనియర్ నాయకులు డాక్టర్ సీఎంఏ జహీర్ అహ్మద్, శివరామకృష్ణ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా స్థానిక రాజకీయ పరిణామాలపై వారు చర్చించారు.

ట్యాగ్స్ :