ఆంధ్రాయూనివర్సిటీ రాష్ట్రానికే కాకుండా దేశానికే గర్వకారణమని, ఫిజిక్స్ నుంచి పాలిటిక్స్ వరకు అన్ని రంగాల్లో ఏయూ తన మార్కును చాటుకుందని లోకేష్ అన్నారు. ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన, భవిష్యత్తులో ఈ వర్సిటీ
విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షించారు. 'నో రిస్క్..నో స్టోరీ' అనే సిద్ధాంతాన్ని తాను నమ్ముతానని, ఓటమి నుంచే విజయం వైపు అడుగులు పడతాయని యువతకు దిశానిర్దేశం చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వర్సిటీలు తమ కరిక్యులమ్ను మార్చుకుని, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను నేర్పాలని సూచించారు. ఏడాదిలోగా వర్సిటీల్లో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేసి, రీసెర్చ్ కోసం ఏయూకి నిధులు కేటాఇస్తామన్నారు.