విశాఖ తీరాన ‘ధైర్యవంతమైన ఈగిల్’

1చూసినవారు
భారత నౌకాదళం 'ఆత్మనిర్భర భారత్' దిశగా మరో మైలురాయిని అధిగమించనుంది. స్వదేశీ సాంకేతికతతో నిర్మితమైన అత్యాధునిక స్టెల్త్ ఫ్రిగేట్ ‘తరగిరి’ని ఏప్రిల్ 3న విశాఖలో భారత నౌకాదళంలోకి ప్రవేశపెడుతున్నారు. 'ధైర్యవంతమైన ఈగిల్'గా అభివర్ణిస్తున్న ఈ యుద్ధనౌక రాకతో సముద్ర జలాల్లో రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. శత్రువుల రాడార్లకు చిక్కకుండా మెరుపుదాడి చేయగల సత్తా ఉన్న ఈ తరగిరి ఫ్రిగేట్, భారత నౌకాదళ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతోంది.