విశాఖలోని ఆంధ్రాయూనివర్సిటీ వరుస సంఘటనలతో వివాదాస్పదంగా మారుతోంది. కొద్ది రోజుల క్రితం ఆహారం బాగోలేదని విద్యార్థులు ఆందోళన చేయగా, తాజాగా విద్యార్థి మణికంఠ మృతితో విశ్వవిద్యాలయం అట్టుడికిపోతోంది. గత మూడు రోజులుగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో, శుక్రవారం యూనివర్సిటీ టాయిలెట్లలో కండోమ్ పాకెట్స్ కనిపించడంతో అసలేం జరుగుతుందో అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గాడితప్పిన ఏయూపై ప్రభుత్వం దృష్టి సారించకపోతే, దేశంలోనే ఖ్యాతిగాంచిన ఈ విశ్వవిద్యాలయం మసకబారుతుందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.