విశాఖలో బుధవారం జరిగిన ప్రమాదంలో డాన్స్ మాస్టర్ పండు గాయపడ్డారు. ఆసుపత్రి వర్గాలు ఆయన హెల్త్ బుల్‌టెన్ విడుదల చేశాయి. ఆర్థోపెడిక్ హెడ్ డాక్టర్ ప్రతాప్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, పండు ఎడమ తుంటి డిస్క్ లొకేషన్‌లో తిరిగి అడ్జస్ట్ చేశారు. ఆయన హిప్ జాయింట్ దెబ్బతింది, మోకాలికి తుంటికి మధ్య ఫ్యాక్చర్ అయింది. తలకు కూడా గాయమైంది. పండు తిరిగి డాన్స్ చేయడానికి సుమారు ఆరు నెలల సమయం పడుతుందని వైద్యులు తెలిపారు.