ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా మూడు కిలోల రాగులు పంపిణీ చేస్తామని ప్రకటించింది. అయితే, 3వ తేదీ వచ్చినా ఆ ప్రక్రియ ప్రారంభం కాలేదు. పాత డైరీ ప్రాంగణంలో సుమారు రేషన్ కార్డుల సంఖ్య ఆధారంగా 4 టన్నుల రాగులు పంపిణీ చేయాల్సి ఉండగా, ప్రస్తుతం కేవలం 600 కిలోలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని తెలిసింది. సరఫరా రాకపోవడంతో రేషన్ డీలర్లు పంపిణీ చేపట్టలేక వేచి చూస్తున్నట్లు సమాచారం.