జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిషోర్ శనివారం విశాఖపట్నం పోర్టు చైర్‌పర్సన్ జేఎస్ బింద్రాను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పోర్టు, జిల్లా అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఇరువురు చర్చించారు. ఇటీవల పోర్టు సాధించిన ప్రగతిని కలెక్టర్‌కు బింద్రా వివరించారు. నగరాభివృద్ధిలో పోర్టు భాగస్వామ్యం మరింత అవసరమని కలెక్టర్ సూచించారు.