విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీలో మత్తు పదార్థాలు విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వినయ్, సాయి, శ్యామ్‌లుగా గుర్తించిన వీరి వద్ద నుంచి 4.5 గ్రాముల ఎండిఎంఏ, 5.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు వినయ్ బెంగళూరు నుంచి డ్రగ్స్ తరలించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. స్థానిక యువతను లక్ష్యంగా చేసుకుని ఈ ముఠా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.