దసరా ఎఫెక్ట్: విశాఖలో కొండెక్కిన నాటుకోడి ధర

6చూసినవారు
దసరా పండుగ సందర్భంగా నగరంలో మాంసం ధరలు విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా విశాలాక్షినగర్ ప్రాంతంలో నాటుకోడి ధర రూ.900 నుంచి రూ.1000 వరకు చేరింది. పండుగ డిమాండ్ కారణంగా ధరలు అధికంగా ఉన్నప్పటికీ, ప్రజలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. గాంధీ జయంతి సందర్భంగా రేపు మాంసం విక్రయాలు నిషేధించబడనున్న నేపథ్యంలో, ఈరోజే చాలామంది కొనుగోళ్లు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్