పరిశ్రమల నిర్వహణకు, కొత్త ప్రాజెక్టుల ఏర్పాటుకు విశాఖ జిల్లా యంత్రాంగం నుంచి పూర్తి సహకారం ఉంటుందని జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. జిల్లాలోని పారిశ్రామికవేత్తలు, వివిధ విభాగాల అధికారులతో కలెక్టరేట్ మీటింగు హాలులో గురువారం జరిగిన డీఐఈపీసీ (డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ఎక్స్పోర్ట్ అండ్ ప్రమోషన్ కమిటీ) సమావేశంలో కలెక్టర్ పలు అంశాలపై మాట్లాడారు.