విశాఖలో వైభవంగా హరే కృష్ణ 'నగర సంకీర్తన'

2చూసినవారు
విశాఖలో వైభవంగా హరే కృష్ణ 'నగర సంకీర్తన'
విశ్వశాంతిని కాంక్షిస్తూ హరే కృష్ణ మూవ్‌మెంట్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం సీతమ్మధారలో 'నగర సంకీర్తన' వైభవంగా జరిగింది. సీతమ్మధార రైతు బజార్ వద్ద ప్రారంభమై కిమ్స్ హాస్పిటల్, సీతంపేట మీదుగా స్నేపర్ పార్క్ వరకు కొనసాగిన ఈ యాత్రలో భక్తులు సంగీత వాయిద్యాలతో, నృత్యాలతో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపారు. చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభువుల విగ్రహాలకు హారతులతో స్వాగతం పలికారు. అనంతరం హరే కృష్ణ మూవ్‌మెంట్ అధ్యక్షులు డాక్టర్ విష్కించిన భక్తదాస గారు సంకీర్తన ప్రాముఖ్యతను వివరించారు.

ట్యాగ్స్ :