విశాఖ జిల్లాలో స్క్రబ్ టైఫస్ కేసులు ఎన్ని ఉన్నాయంటే..?

5చూసినవారు
విశాఖ జిల్లాలో స్క్రబ్ టైఫస్ కేసులు ఎన్ని ఉన్నాయంటే..?
రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఏపీలోని 26 జిల్లాల్లోనూ పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. గడ్డి, పొలాలు, తడి నేలలు, చెత్తతో ఉన్న ప్రదేశాల్లో కొన్ని రకాల నల్లని నల్లి వంటి పురుగులు కాటేయడం ద్వారా ఈ వ్యాధి మనిషికి సోకుతుంది. ఈ క్రమంలో విశాఖపట్నం జిల్లాలో 125కి కేసులు వెలుగులోకి వచ్చాయి. ఉన్నట్లుండి జ్వరం, తలనొప్పి, కండరాలు, కీళ్లు నొప్పులు, విరేచనాలతో పాటు పలు లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
Job Suitcase

Jobs near you