ఒమన్ తీరంలో క్షిపణి దాడి: విశాఖ ఇంజనీర్ మృతి

1చూసినవారు
ఒమన్ తీరంలో క్షిపణి దాడి: విశాఖ ఇంజనీర్ మృతి
ఒమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న నౌకపై అమెరికా క్షిపణి దాడిలో విశాఖపట్నం శ్రీహరిపురానికి చెందిన మెరైన్ చీఫ్ ఇంజనీర్ పట్నాల సురేష్ మృతి చెందారు. ఈ దాడిలో మరణించిన ముగ్గురిలో సురేష్ ఒకరు. పది రోజుల్లో ఇంటికి వస్తానని కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లిన సురేష్, విధి నిర్వహణలో ఉండగా ఈ విషాదం చోటుచేసుకుంది. సురేష్ మరణంతో భార్య భార్గవి, ఇద్దరు కుమారులు, అలాగే అనాథలైన ఇద్దరు ఆడపిల్లలు అండగా నిలిచేవారు లేకుండా పోయారు. సురేష్ తల్లి రామలక్ష్మి తన కొడుకు క్షేమంగా తిరిగి వస్తాడని ఆశతో ఎదురుచూస్తోంది. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గణబాబు సురేష్ కుటుంబాన్ని పరామర్శించి, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సురేష్ భౌతికకాయాన్ని త్వరగా స్వగ్రామానికి తీసుకురావాలని బంధువులు విజ్ఞప్తి చేస్తున్నారు.