పి.ఎం.పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో కుటుంబ కలహాల కారణంగా ఇంటి నుంచి వెళ్లిపోయిన మహిళ ఆచూకీపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో విస్తృత గాలింపు చేపట్టి మంగళవారం ఆమె ఆచూకీని గుర్తించారు. అనంతరం మహిళను క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా సిబ్బందిని నగర పోలీస్ కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి అభినందించారు.