పెందుర్తి: 20 కేజీల గంజాయి గుర్తించిన డాగ్

10చూసినవారు
పెందుర్తి: 20 కేజీల గంజాయి గుర్తించిన డాగ్
పెందుర్తి రైల్వే స్టేషన్ పరిసరాల్లో సెక్యూరిటీ వింగ్ పోలీసులు మంగళవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. నార్కోటిక్ డాగ్ సహాయంతో సుమారు 20 కేజీల గంజాయిని (4 ప్యాకెట్లలో) గుర్తించారు. గంజాయితో పాటు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని పెందుర్తి పోలీసులకు అప్పగించారు. గంజాయిని గుర్తించిన నార్కోటిక్ డాగ్‌ను, దాని హ్యాండ్లర్‌ను సీపీ శంఖబ్రత బాగ్చి అభినందించారు.