ఏపీలో రానున్న 5 రోజులు వర్షాలు: విశాఖ‌ వాతావరణ శాఖ

0చూసినవారు
విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, నైరుతి రుతుపవనాలు ఉత్తర దిశగా పయనిస్తున్నాయి. దీని ప్రభావంతో నేటి నుంచి రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉండటంతో, వర్షాల సమయంలో గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని ఆయన పేర్కొన్నారు. జూన్ 10 నాటికి దక్షిణ కోస్తా అంతటా, జూన్ 15 నాటికి రాష్ట్రవ్యాప్తంగా ఈ రుతుపవన వర్షాలు పూర్తిగా విస్తరిస్తాయని వెల్లడించారు.

ట్యాగ్స్ :