ఇంట్లో ఉడుము కలకలం

0చూసినవారు
విశాఖలో స్టీల్ ప్లాంట్ సెక్టార్-8లోని ఓ ఇంట్లో శనివారం ఉదయం బాత్‌రూమ్ కమోడ్‌లో ఉడుము కనిపించడంతో ఇంట్లోవారు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్ కిరణ్ కుమార్‌కు సమాచారం అందించగా, ఆయన అక్కడికి చేరుకొని చాకచక్యంగా ఉడుమును పట్టుకున్నారు. పాములు, ఉడుములు వంటి జీవులు కనిపించినప్పుడు భయపడకుండా తమకు సమాచారం అందించాలని కిరణ్ కుమార్ సూచించారు.

సంబంధిత పోస్ట్