గురువారం రామకృష్ణ బీచ్ వద్ద
ఎన్టీఆర్ 103వ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి ఎంపీ ఎం. శ్రీభరత్, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుతో కలిసి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ, రాజకీయ పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే కాంగ్రెస్‌ను ఓడించిన ఘనత ఎన్టీఆర్‌దేనని, దేశంలో సంక్షేమ పథకాలకు ఆయనే ఆద్యుడని కొనియాడారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను మంత్రి నారా లోకేష్ మహానాడులో ప్రకటించడాన్ని ఆయన స్వాగతించారు.
టీడీపీ ఎన్టీఆర్ ఆశయాలు, సిద్ధాంతాలకు అనుగుణంగానే ముందుకు వెళ్తోందని ఆయన పేర్కొన్నారు.