విశాఖ ఉత్సవ్‌ ముగింపు వేడుకలను దిగ్విజయం చేయాలి

7చూసినవారు
విశాఖ ఉత్సవ్‌ ముగింపు వేడుకలను దిగ్విజయం చేయాలి
ఎనిమిది రోజులుగా జరుగుతున్న విశాఖ ఉత్సవ్ ముగింపు వేడుకలను విజయవంతంగా నిర్వహించాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. చివరి రోజు సందర్శకుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, అందుకు తగ్గట్టుగా అదనపు సీటింగ్, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు. పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు, ప్రశంసా పత్రాలు సిద్ధం చేయాలని తెలిపారు. ఉత్సవాల నిర్వహణలో సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో ఆర్డీవోలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్