విశాఖలో విజిలెన్స్ ఏవేర్నెస్ వీక్‌

3చూసినవారు
విశాఖలో విజిలెన్స్ ఏవేర్నెస్ వీక్‌
విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) ఇంగ్లిష్ విభాగంలో శుక్రవారం విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా ఇంటెగ్రిటీ ప్లెడ్జ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో విభాగపు అధిపతి, బ్రాండింగ్ అండ్ మీడియా అసోసియేట్ డీన్ ఆచార్య సాల్మన్ బెన్నీ, ఆచార్యులు, విద్యార్థులతో కలిసి సమగ్రత, నిజాయితీ, పారదర్శకతను పాటించేందుకు ప్రతిజ్ఞ చేశారు. పౌరులు, ప్రభుత్వ ఉద్యోగులు ఈ సూత్రాలను పాటించడం ద్వారా దేశాభివృద్ధికి తోడ్పడతారని ఆచార్య సాల్మన్ బెన్నీ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్