విశాఖ: జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్‌లో 18 వినతులు

547చూసినవారు
విశాఖ: జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్‌లో 18 వినతులు
మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ (జీవీఎంసీ) నిర్వహించిన టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్‌లో మొత్తం 18 వినతులు స్వీకరించినట్లు జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ ఎ. ప్రభాకరరావు తెలిపారు. శుక్రవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో డీసీపీలు, ఏసీపీలు పాల్గొనగా ఈ ప్రత్యేక కార్యక్రమం జరిగింది. పట్టణ ప్రణాళికా విభాగానికి సంబంధించి ప్రజల నుంచి అధిక సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో, ప్రతి శుక్రవారం ప్రత్యేక ఓపెన్ ఫోరమ్ నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. స్వీకరించిన వినతులు, ఫిర్యాదులను అధికారులు నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేసినట్లు ప్రభాకరరావు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్