విశాఖ‌: ఏయూలో 523 అధ్యాపక పోస్టుల భర్తీ

0చూసినవారు
విశాఖ‌: ఏయూలో 523 అధ్యాపక పోస్టుల భర్తీ
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 3,220 అధ్యాపక పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అత్యధికంగా 523 పోస్టులు భర్తీ చేయనున్నారు. గత నోటిఫికేషన్లలో ఎదురైన న్యాయపరమైన, సాంకేతిక లోపాలను సరిదిద్ది, త్వరలోనే కొత్త నోటిఫికేషన్లు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో నిరుద్యోగ మేధావులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి.