ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ)లో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేసి లక్షల రూపాయలు వసూలు చేసిన ఘటనపై తక్షణమే సమగ్ర విచారణ జరపాలని ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు గౌనిపల్లి కిరణ్ కుమార్ డిమాండ్ చేశారు. విశాఖపట్నంలో మాట్లాడుతూ, ఏయూలో ఉద్యోగాల పేరుతో నకిలీ నియామక పత్రాలు జారీ చేయడం, అధికారుల సంతకాలను ఫోర్జరీ చేయడం విశ్వవిద్యాలయ ప్రతిష్ఠను తీవ్రంగా దెబ్బతీసే చర్యలని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దందాలో ప్రమేయం ఉన్న వారందరిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, దోషులను రక్షించే ప్రయత్నం చేస్తే తీవ్రస్థాయిలో ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు.