విశాఖ: అడ్రస్ మారింది తప్ప.. డ్రెస్ కాదు: వెంకయ్య నాయుడు

1311చూసినవారు
తన కుటుంబం నుంచి ఎవరూ రాజకీయాల్లోకి రాలేదని, స్వయంకృషితోనే ఈ స్థాయికి ఎదిగానని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం (ఏయూ) శతాబ్ది ఉత్సవాల్లో ఆయన మాట్లాడుతూ, ఉపరాష్ట్రపతి అయ్యాక కూడా తన సాధారణ దుస్తులను చూసి కొందరు అడిగితే, 'నాకు డ్రెస్ మారలేదు, కేవలం అడ్రస్ మాత్రమే మారింది' అని సమాధానమిచ్చినట్లు తెలిపారు. విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తూ, ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపోయే ప్రసక్తే ఉండదని, క్రమశిక్షణ, నిరంతర కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చని ఆయన ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్