విశాఖపట్నం డివిజన్ పరిధిలోని నోటిఫైడ్ బార్ అండ్ రెస్టారెంట్లకు లైసెన్సుల కేటాయింపు ప్రక్రియ గురువారం జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ళ విధ్యాధరి పర్యవేక్షణలో పారదర్శకంగా జరిగింది. మొత్తం 52 బార్లకు నోటిఫికేషన్ రాగా, 27 బార్ల నుండి దరఖాస్తులు అందాయి. ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చిన చోట్ల లాటరీ ద్వారా, సింగిల్ దరఖాస్తులు వచ్చిన వారికి నిబంధనల ప్రకారం లైసెన్సులు ఖరారు చేశారు.