విశాఖ: మే 2న ఏపీ ఐసెట్-2026 పరీక్ష

487చూసినవారు
విశాఖ: మే 2న ఏపీ ఐసెట్-2026 పరీక్ష
మే 2వ తేదీ శనివారం ఏపీ ఐసెట్-2026 పరీక్షను నిర్వహించనున్నట్లు కన్వీనర్ ఆచార్య ఎం. శశి బుధవారం విశాఖలో తెలిపారు. ఈ పరీక్షకు మొత్తం 26,300 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పరీక్ష రెండు సెషన్లలో (ఉదయం 9:00 - 11:30, మధ్యాహ్నం 2:00 - 4:30) జరుగుతుంది. అభ్యర్థులు పరీక్షా సమయానికి ఒకటిన్నర గంట ముందుగానే కేంద్రానికి చేరుకోవాలి. ఉదయం 9:00 గంటలు, మధ్యాహ్నం 2:00 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్పష్టం చేశారు. అభ్యర్థులు హాల్ టికెట్‌తో పాటు ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డును తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్