విశాఖ: 27న ఏయూ శతాబ్ది ఉత్సవాలు: హాజరుకానున్న సచిన్

5చూసినవారు
ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలకు రంగం సిద్ధమైంది. సోమవారం సాయంత్రం 4 గంటలకు ఏయూ ఇంజనీరింగ్ మైదానంలో జరిగే ఈ వేడుకలకు ఉపరాష్ట్రపతి సి. పి. రాధాక్రిష్ణన్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు, గవర్నర్లు సహా సుమారు 25 వేల మంది అతిథులు పాల్గొనే ఈ వేడుకల్లో భాగంగా ప్రత్యేక తపాల బిళ్ల, స్మారక నాణెం విడుదల చేయనున్నారు. నగర ప్రజల కోసం ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రత్యక్ష ప్రసార ఏర్పాట్లు చేసినట్లు వీసీ ఆచార్య జి. పి. రాజశేఖర్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్