విశాఖ: ఘనంగా ఏయూ శతాబ్ది వ్యవస్థాపక దినోత్సవం

468చూసినవారు
విశాఖ: ఘనంగా ఏయూ శతాబ్ది వ్యవస్థాపక దినోత్సవం
ఆదివారం ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య జి. పి రాజశేఖర్ ప్రథమ ఉపకులపతి సర్ కట్టమంచి రామలింగారెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఏయూ @ 100 వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి, విశ్వవిద్యాలయ అభివృద్ధికి సేవలందించిన వారిని స్మరించుకున్నారు. భవిష్యత్ తరాలకు నేటి చరిత్రను అందించేందుకు టైం కాప్సూల్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్