విశాఖపట్నం కలెక్టరేట్‌లో శనివారం ప్రముఖ సాహితీవేత్త, వాగ్మీ పుట్టపర్తి నారాయణాచార్యుల జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో విశ్వేశ్వర నాయుడుతో పాటు పలువురు అధికారులు పాల్గొని, ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా, నారాయణాచార్యుల సాహిత్య, ఆధ్యాత్మిక సేవలను అధికారులు కొనియాడారు. తెలుగు, సంస్కృత భాషల అభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.