విశాఖ‌: ఆంధ్ర యూనివర్సిటీకి బాంబు బెదిరింపు

12చూసినవారు
విశాఖ‌: ఆంధ్ర యూనివర్సిటీకి బాంబు బెదిరింపు
విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీకి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు ఈమెయిల్ రావడం కలకలం రేపింది. గురువారం ఈమెయిల్ అందిన వెంటనే యూనివర్సిటీ వర్గాలు పోలీసులకు సమాచారం అందించాయి. అప్రమత్తమైన పోలీసులు, బాంబ్ స్క్వాడ్ సిబ్బందితో కలిసి క్యాంపస్ అంతా క్షుణ్ణంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ మెయిల్ ఎక్కడి నుండి వచ్చిందనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. అధికారులు విద్యార్థులకు, సిబ్బందికి భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశామని, ఆందోళన చెందవద్దని సూచించారు.

ట్యాగ్స్ :