విశాఖ: కూటమి సభపై బొత్స ధ్వజం

0చూసినవారు
విశాఖ: కూటమి సభపై బొత్స ధ్వజం
శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తిరుపతిలో జరిగిన కూటమి సభను 'అట్టర్ ప్లాప్ వెన్నుపోటు సభ'గా అభివర్ణించారు. ప్రభుత్వం రెండేళ్ల పాలనలో నిత్యావసరాల ధరలు, కరెంట్ ఛార్జీలు పెంచి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టిందని ఆయన ఆరోపించారు. 'ఆడబిడ్డ నిధి' వంటి హామీలను విస్మరిస్తున్నారని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. బీచ్‌లలో మద్యం సేవించడం ద్వారా పర్యాటకం అభివృద్ధి చెందదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో గుడివాడ అమర్‌నాథ్, కె. కె. రాజు కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్