విశాఖపట్నంలో సీఏ చదువుతున్న విద్యార్థి అఖిల్ వెంకట వంశీ ఆత్మహత్య చేసుకున్నాడు. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినట్లు ఇంట్లో అబద్ధం చెప్పినందుకు మనస్తాపం చెంది, మంగళవారం కొబ్బరి తోటలోని గదిలో ఉరి వేసుకున్నాడు. టూటౌన్ సీఐ ఎర్రన్నాయుడి వివరాల ప్రకారం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు దర్యాప్తు చేపట్టారు.