ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌పై నమోదైన కేసులను వెంటనే ఎత్తివేయాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. మీడియా స్వేచ్ఛను, వాక్ స్వాతంత్ర్యాన్ని కాపాడాలని, నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, వ్యక్తిత్వ హననం తగదని వారు అన్నారు. ఆయనపై పెట్టిన కేసులను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.