విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరుగుతున్న మెగా కల్చరల్ ఫెస్ట్ రెండో రోజు మంగళవారం రాత్రి ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ ఎం. శ్రీభరత్, ఏయూను ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. సినీ నటుడు శివాజి యువత క్రమశిక్షణతో, ఒత్తిడి లేకుండా లక్ష్యాల దిశగా సాగాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థుల నృత్యాలు, గాన కచేరీలు అలరించగా, ప్రతిభావంతులైన విద్యార్థులను సత్కరించారు. వీసీ ఆచార్య జి. పి. రాజశేఖర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.