విశాఖ జిల్లా వైఎస్సార్
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, జిల్లా పార్టీ అధ్యక్షుడు కె. కె. రాజు ఆధ్వర్యంలో చంద్రబాబు దుర్మార్గ, అరాచక పాలనకు వ్యతిరేకంగా ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. రెండేళ్లుగా సాగుతున్న చంద్రబాబు రాక్షస పాలనను ప్రజలకు వివరించేందుకే ఈ కార్యక్రమం చేపట్టామని కె. కె. రాజు తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు, ప్రచార విభాగం అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ మేయర్, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.