డిసెంబర్ 9 నుంచి 11వ తేదీ వరకు విశాఖలోని సెయింట్ ఆంథోనీ స్కూల్‌లో 3వ మెగా చిల్డ్రన్స్ ఫెస్టివల్ 'విశాఖ బాలోత్సవం' జరగనుంది. ఈ కార్యక్రమ పోస్టర్‌ను మంగళవారం జీవీఎంఆర్‌డీఏ కమిషనర్ ఎన్. భరత్ తేజ్ ఆవిష్కరించారు. ఈసారి విశాఖ వ్యాలీ రోటరీతో కలిసి బాలోత్సవాన్ని నిర్వహిస్తున్నామని ప్రధాన కార్యదర్శి జి. ఎస్. రాజేశ్వరరావు తెలిపారు. గత సంవత్సరం కంటే ఎక్కువ మంది పిల్లలు పాల్గొంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.