డిసెంబర్ 31 నుంచి జనవరి 4 వరకు విశాఖలో సీఐటీయూ అఖిలభారత మహాసభలు జరగనున్నాయి. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు వై. రాజు ఆధ్వర్యంలో జగదాంబ సెంటర్‌లోని క్లాక్ టవర్ వద్ద సీఐటీయూ పైలాన్‌ను ఆవిష్కరించారు. రాబోయే మూడేళ్లకు సంబంధించిన ఉద్యమాలు, తీర్మానాలపై చర్చించి కార్యాచరణ రూపొందించనున్నట్లు సీఐటీయూ నాయకులు తెలిపారు. జనవరి 4న జరిగే ర్యాలీలో భారీగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.