విశాఖ: గీతం భూములపై స్పష్టత ఇవ్వాలి: వైసీపీ

3చూసినవారు
విశాఖ: గీతం భూములపై స్పష్టత ఇవ్వాలి: వైసీపీ
విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ను వైసీపీ నాయకులు కలిసి, గీతం యూనివర్సిటీకి 54 ఎకరాల 79 సెంట్ల ప్రభుత్వ భూమి బదలాయింపు అంశంపై పూర్తి వివరాలు వెల్లడించాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు కె.కె. రాజు ఆధ్వర్యంలో సమర్పించిన వినతిపత్రంలో, ఈ బదలాయింపుపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోందని, ఈ నిర్ణయాన్ని వెంటనే నిలిపివేసి ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్