ఈ నెల 5, 8 తేదీల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో, పర్యటన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం పర్యటనకు సంబంధించి భద్రత, ప్రోటోకాల్, ఇతర మౌలిక వసతుల కల్పనపై అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, ఈపీడీసీఎల్ సీఎండీ ఉమ్మడి పృథ్వితేజ్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్, జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరితో పాటు కేంద్ర మత్స్యశాఖ, ఫిషరీస్ బోర్డు, ఎంపెడా అధికారులు పాల్గొని ఏర్పాట్లపై చర్చించారు.