విశాఖ: నియోజకవర్గాల అభివృద్ధిపై కలెక్టర్ సమీక్ష

2చూసినవారు
విశాఖ: నియోజకవర్గాల అభివృద్ధిపై కలెక్టర్ సమీక్ష
విశాఖ జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. భీమిలిలో ఆర్టీసీ డిపో, పీహెచ్‌సీ భవన నిర్మాణం, దక్షిణ నియోజకవర్గంలో టిడ్కో ఇళ్లు, కేజీహెచ్ అభివృద్ధి వంటి పనులను వేగవంతం చేయాలని, ఆనందపురంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు, మత్స్యకారుల కోసం ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణంపై దిశానిర్దేశం చేస్తూ, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్