విశాఖ: 11న అఖిల పక్షాలతో కాంగ్రెస్ నిరసన

6చూసినవారు
విశాఖ: 11న అఖిల పక్షాలతో కాంగ్రెస్ నిరసన
విశాఖపట్నం దక్షిణ ఎల్లమ్మ తోటలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో, జిల్లా అధ్యక్షుడు హాసిని వర్మ రాజు మాట్లాడుతూ, ఈ నెల 11న గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ గాంధీ పార్క్ వద్ద అఖిల పక్షాలతో కలిసి నిరసన, నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు తెలిపారు. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే ఈ ఆందోళన నిర్వహిస్తున్నామని, ఐదు నెలలుగా బిల్లులు బకాయి పెట్టారని, ఫిబ్రవరి 25 వరకు కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ అంశంపై వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్