విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చీ బుధవారం ఆర్ముడ్ రిజర్వ్ మైదానాన్ని సందర్శించి, ఇన్స్పెక్షన్ పరేడ్ను పరిశీలించారు. లాఠీ డ్రిల్, వెపన్ అసెంబ్లింగ్, డాగ్ స్క్వాడ్ పనితీరును గమనించి, సిబ్బంది వినతులను స్వీకరించారు. రానున్న ఏడాదిలో నగరంలో జరగనున్న ప్రతిష్టాత్మక కార్యక్రమాల దృష్ట్యా, సిబ్బంది ఆరోగ్యంగా, దృఢంగా విధులు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. సమస్యలుంటే తన వ్యక్తిగత నంబరు 79950 95799 ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు. సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.